
Published : 25 Jan 2022 05:09 IST
మంచుతృణం మెరుపు ఘనం!
కాలానుగుణంగా ప్రకృతి గీసే చిత్రాలు కనువిందు చేస్తూనే ఉంటాయి. అందుకు అద్దం పట్టేదే మీరు చూస్తున్న చిత్రం.. దాన్ని చూసి ఏదో పురుగు పాకుతోందే అనుకుంటే పొరపడినట్టే... కరీంనగర్ శివారులోని పొలాల వద్ద ఓ గడ్డి మొక్కపై దట్టంగా మంచు కురిసింది. బిందువుల్లా మారి మొక్కనంతా ఆవరించింది. చూపరులను ఆ దృశ్యం గడ్డిలో బొంత పురుగు పాకుతుందనేలా భ్రమింపజేస్తోంది. ఆకట్టుకునే ఈ చిత్రం సోమవారం ఉదయం ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.
- ఈనాడు, కరీంనగర్
Tags :