మార్చి 20 వరకే బాలాలయం కొనసాగింపు

యాదాద్రిలోని బాలాలయం వచ్చే మార్చి 20 వరకే కొనసాగుతుందని యాడా వైస్‌ఛైర్మన్‌ కిషన్‌రావు స్పష్టం చేశారు. కొండ కింద గండిచెరువు ప్రాంగణంలో ఆ నెల 21 నుంచి మొదలై మహాయాగం ముగిసే వరకు

Published : 25 Jan 2022 05:09 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలోని బాలాలయం వచ్చే మార్చి 20 వరకే కొనసాగుతుందని యాడా వైస్‌ఛైర్మన్‌ కిషన్‌రావు స్పష్టం చేశారు. కొండ కింద గండిచెరువు ప్రాంగణంలో ఆ నెల 21 నుంచి మొదలై మహాయాగం ముగిసే వరకు నిత్యారాధనలు, దర్శనాలు నిర్వహిస్తామన్నారు. మహాకుంభ సంప్రోక్షణానంతరం పునర్నిర్మిత ప్రధానాలయంలోని స్వయంభువుల దర్శనాలు మార్చి 28 నుంచి పునఃప్రారంభమవుతాయన్నారు.

* మహాయాగం నిర్వహించనున్న ప్రాంగణంలో మరో బాలాలయాన్ని ఏర్పాటుచేసి ఉత్సవమూర్తులతో దైవదర్శనాల సదుపాయం కల్పిస్తారా లేక యాడా వైస్‌ఛైర్మన్‌ చెప్పిన ప్రకారం ప్రస్తుతం బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులను కొండ కిందికి తరలించి దర్శనాలు చేయిస్తారా అన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. ఈ విషయమై ప్రధాన పూజారి లక్ష్మీనరసింహాచార్యను సంప్రదించగా లక్ష్మీనారసింహుల కవచమూర్తులను కొండ కిందకు తరలించే యోచన సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

* మహాక్రతువులో భాగంగా కొండ కింద చేపట్టనున్న మహాయాగానికి భారీగా భక్తులు రానున్న దృష్ట్యా దైవదర్శనాలను కొండ కిందే జరపాలని యాడాతో పాటు దేవాదాయశాఖ యోచిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని