
లారీ ఎక్కిన బోటు!
సముద్రంలోనో నదులలోనో తిరగాల్సిన పడవ.. ఇదేంటి రోడ్డున పడి లారీ ఎక్కింది.. అని ఆశ్చర్యపోవద్దు.. రివర్ పెరల్(నదిలోముత్యం) పేరుతో కనిపిస్తున్న చేపల వేటకు వినియోగించే ఈ బోటును గోవానుంచి విశాఖపట్నానికి తరలిస్తున్నట్లు డ్రైవర్ తెలిపారు. నల్గొండ జిల్లా కనగల్ మీదుగా భారీవాహనంపై ఈ నావను చెట్ల కొమ్మలు తాకకుండా నెమ్మదిగా తీసుకెళుతుండగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
- న్యూస్‌టుడే, కనగల్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.