ఏపీఎస్‌ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో రద్దీని బట్టి ఛార్జీలు

ఏపీఎస్‌ఆర్టీసీ ఎంపిక చేసిన ఏసీ బస్సుల్లో అవసరాన్ని బట్టి ఛార్జీలు తగ్గించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొన్ని జిల్లాల్లో మంగళవారం నుంచే వీటిని అమలుచేయడం ఆరంభించారు. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు నడిచే కొన్ని సర్వీసుల్లో ఛార్జీలు తగ్గించారు

Published : 26 Jan 2022 05:36 IST

ఈనాడు-అమరావతి:  ఏపీఎస్‌ఆర్టీసీ ఎంపిక చేసిన ఏసీ బస్సుల్లో అవసరాన్ని బట్టి ఛార్జీలు తగ్గించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొన్ని జిల్లాల్లో మంగళవారం నుంచే వీటిని అమలుచేయడం ఆరంభించారు. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు నడిచే కొన్ని సర్వీసుల్లో ఛార్జీలు తగ్గించారు. ఏసీ బస్సులతోపాటు, దూర ప్రాంత ఇతర సర్వీసుల్లో సైతం పరిస్థితిని బట్టి 10-20 శాతం ఛార్జీలు తగ్గించుకునేందుకు వీలుగా 2016లో యాజమాన్యం ఉత్తర్వులిచ్చింది. అయితే అమలు చేయడం లేదు. తాజాగా ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు మంగళవారం అన్ని జోన్ల ఈడీలు, అన్ని జిల్లాల ఆర్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. 20 శాతం వరకు ఛార్జీలు తగ్గించేందుకు వీలుగా గత ఉత్తర్వుల అమలుకు  ఆదేశాలిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని