టీవీ పాఠాలు చూస్తున్నవారు 63 శాతం

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థుల్లో 63.38 శాతం మంది టీవీల్లో ప్రసారమయ్యే డిజిటల్‌ పాఠాలు వీక్షిస్తున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం గణాంకాలను విడుదల చేసింది. ఈనెల 24 నుంచి టీశాట్‌(విద్యా ఛానెల్‌) ద్వారా పాఠాలను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.

Published : 26 Jan 2022 06:09 IST

గణాంకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థుల్లో 63.38 శాతం మంది టీవీల్లో ప్రసారమయ్యే డిజిటల్‌ పాఠాలు వీక్షిస్తున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం గణాంకాలను విడుదల చేసింది. ఈనెల 24 నుంచి టీశాట్‌(విద్యా ఛానెల్‌) ద్వారా పాఠాలను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 8, 9, 10 తరగతుల విద్యార్థులు 7,19,385 మంది ఉండగా వారిలో 3,07,154 మంది(42.70 శాతం) టీశాట్‌ ద్వారా పాఠాలు చూశారు. మరో 1,31,130 మంది (18.23 శాతం) స్మార్ట్‌ ఫోన్లు/ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా వీక్షించారు. ఇంకా 16,571 మంది తోటి విద్యార్థుల వద్ద ఉన్న ఫోన్ల ద్వారా.. 1,057 మంది గ్రామ పంచాయతీల్లో ఉన్న టీవీల ద్వారా పాఠాలు తిలకించారు. అంటే మొత్తం 4,55,912 మంది (63.38 శాతం) టీవీ పాఠాలు వినియోగించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ మూడు తరగతుల్లో 36,440 మంది పిల్లలకు పాఠాలు వీక్షించేందుకు ఏ ఒక్క పరికరం లేదు. మొత్తం 19,526 వాట్సాప్‌ గ్రూపులు రూపొందించి ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని