
కేంద్ర జలసంఘం సభ్యుడిగా చంద్రశేఖర్ అయ్యర్
ఈనాడు, అమరావతి: గోదావరి బోర్డు ఛైర్మన్‌గా ఉన్న జె.చంద్రశేఖర్ అయ్యర్‌ను కేంద్ర జలసంఘం సభ్యుడిగా నియమించారు. సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్ సర్వీసు హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ ఆఫీసర్‌గా ఉన్న అయ్యర్‌ను ఈ పోస్టులో నియమించారు. హైదరాబాద్ నుంచి దిల్లీ బదిలీ చేశారు. ప్రస్తుతం చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గోదావరి బోర్డు ఛైర్మన్‌గా ఎం.పి.సింగ్‌కు అదనపు బాధ్యతలు
ప్రస్తుతం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా ఉన్న ఎం.పి.సింగ్‌కు గోదావరి బోర్డు ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.