
Published : 27 Jan 2022 05:08 IST
ఇతర ఖనిజ తవ్వకాలూ చేపడతాం: సింగరేణి
ఈనాడు, హైదరాబాద్: బొగ్గుతో పాటు ఇసుక, ఇతర ఖనిజాల తవ్వకాలూ చేపట్టాలని యోచిస్తున్నామని సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ వద్ద ఆయన బుధవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సంస్థ చరిత్రలో తొలిసారి ఇతర రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాలు చేపట్టామని, వచ్చే ఏప్రిల్ నుంచి ఒడిశాలోని నైనీ గనిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని వివరించారు. అదే రాష్ట్రంలో న్యూపాత్రపాద గని కూడా త్వరలో ప్రారంభమవుతుందన్నారు. కేంద్రం నిర్వహిస్తున్న వేలంపాటల్లో పాల్గొని ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు గనులనూ చేజిక్కించుకుంటామని తెలిపారు.
Tags :