
Published : 27 Jan 2022 05:08 IST
టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో మార్పులు
రాంనగర్, న్యూస్‌టుడే: టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో కొన్ని మార్పులు చేసినట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలోని బస్ భవన్లో జాతీయ జెండాను ఎగరేసిన అనంతరం ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లు పోర్టల్ tsrtc.telangana.gov.inను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులు సులభంగా వినియోగించుకునేలా పాత పోర్టల్‌లో మార్పులు చేసి అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. కొత్త వెబ్‌సైట్‌ను సందర్శించి ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
Tags :