
Published : 27 Jan 2022 05:08 IST
ఆహ్లాదం.. వైద్యం.. ఆరోగ్యం!
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పిల్లల వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఆసుపత్రిలో ఇప్పటికే పిల్లల కోసం 40 పడకలతో కూడిన వార్డు అందుబాటులో ఉండగా.. కొత్త భవనం రెండో అంతస్తులో రూ.30లక్షల వెచ్చించి 12 పడకల ఐసీయూ, 30 పడకల ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన వార్డును ఏర్పాటు చేశారు. గోడలపై అలరించే కార్టూన్ బొమ్మలతో ఆహ్లాదకర వాతావరణంలో వార్డు అందుబాటులోకి రావడంతో ఆసుపత్రికి వచ్చే చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు లభించనున్నాయి.
- న్యూస్టుడే, చైతన్యపురి(కరీంనగర్)
Tags :