
Published : 27 Jan 2022 05:08 IST
చలి మళ్లీ వణికిస్తోంది
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ అధికమవుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం తెల్లవారుజామున అత్యల్పంగా అర్లి(ఆదిలాబాద్ జిల్లా)లో 9.7, ఆదిలాబాద్‌లో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత నమోదవడం ఈ నెలలో ఇదే తొలిసారి. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరిగిందని వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది.
Tags :