శిశు తరగతులకూ మధ్యాహ్నభోజనం

ప్రభుత్వ పాఠశాలల్లో పీఎం పోషణ్‌ పథకం కింద ఇస్తున్న మధ్యాహ్న భోజనం ఇక నుంచి శిశు లేదా పూర్వ ప్రాథమిక తరగతుల చిన్నారులకూ అందనుంది. ప్రభుత్వం కొద్ది నెలల క్రితం మధ్యాహ్న భోజన పథకం పేరును పీఎం పోషణ్‌గా మార్చింది.

Published : 27 Jan 2022 05:08 IST

ప్రతిపాదనలు కోరిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పీఎం పోషణ్‌ పథకం కింద ఇస్తున్న మధ్యాహ్న భోజనం ఇక నుంచి శిశు లేదా పూర్వ ప్రాథమిక తరగతుల చిన్నారులకూ అందనుంది. ప్రభుత్వం కొద్ది నెలల క్రితం మధ్యాహ్న భోజన పథకం పేరును పీఎం పోషణ్‌గా మార్చింది. ఇప్పటివరకు ఒకటో తరగతి విద్యార్థుల నుంచే ఆ పథకాన్ని అమలు చేస్తుండగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకూ వర్తింపజేస్తారు. ఈ మేరకు ప్రతిపాదనలను పంపాలని కేంద్ర విద్యాశాఖ.. అన్ని రాష్ట్రాలను తాజాగా ఆదేశించింది. ఈక్రమంలో ఆయా రాష్ట్రాల విద్యాశాఖల అధికారులు తమ రాష్ట్రంలో శిశు విద్యలోని విద్యార్థుల సంఖ్యను కూడా పేర్కొని అవసరమయ్యే నిధులపై  ఫిబ్రవరి 7 నాటికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలి. అదే నెల 17న కేంద్ర విద్యాశాఖ అధికారులు వాటిపై చర్చించి... నిధుల మంజూరుకు ఆమోదం తెలుపుతారు. పథకానికయ్యే మొత్తం వ్యయంలో 60 శాతాన్ని కేంద్రం తన వాటాగా మంజూరు చేస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను చదివే వారు తెలంగాణలో 4,776 మందే ఉన్నట్లు 2019-20 గణాంకాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని