మినీ ట్రాక్టర్లు ఆకారంలో చిన్న.. పనిలో మిన్న!

ఒకవైపు కూలీల కొరత, మరోవైపు పొలం పనులకు పశువుల అందుబాటు లేక రైతన్నలు సకాలంలో సేద్యపు పనులను నిర్వహించలేకపోతున్నారు. తక్కువ ధరలో లభిస్తూ సులువుగా వాడదగ్గ యంత్ర పరికరాల వినియోగానికి రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

Published : 27 Jan 2022 05:08 IST

కవైపు కూలీల కొరత, మరోవైపు పొలం పనులకు పశువుల అందుబాటు లేక రైతన్నలు సకాలంలో సేద్యపు పనులను నిర్వహించలేకపోతున్నారు. తక్కువ ధరలో లభిస్తూ సులువుగా వాడదగ్గ యంత్ర పరికరాల వినియోగానికి రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మినీ ట్రాక్టర్లు సాగులో విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. వీటితో రైతులు విత్తడం, అంతరకృషి, రవాణా వంటి సేద్య పనులను సౌకర్యవంతంగా చేసుకోవచ్చు. వీటి వాడకంతో సాగు ఖర్చు తగ్గి పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఫీచర్లతో తయారుచేసిన మినీ ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా పదివేల యూనిట్ల మినీ ట్రాక్టర్లను దేశంలో  విక్రస్తున్నారు. ఈ ట్రాక్టర్లను ఎక్కువగా వ్యవసాయ  పనుల కోసమే వాడతారు. వీటికి వివిధ పరికరాలను తగిలించి విత్తడం, చల్లడం, దుక్కి చేయడం, బరువులెత్తడం, కోత, రవాణా వంటి పనులు చేసుకోవచ్చు. మినీ ట్రాక్టర్‌ ట్రాలీలు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ సామర్థ్యమున్న ఇంజిన్‌ ఉండటం వల్ల ఈ ట్రాక్టర్‌లు తక్కువ పన్ను పరిధిలో ఉంటాయి. కాబట్టి వీటి ధర తక్కువే. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మినీ ట్రాక్టర్లతో సాగులో ఎలాంటి పనులు చేసుకోవచ్చు? వీటిని కొనుగోలు చేసేముందు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలేమిటి? మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని ప్రధాన కంపెనీల మినీ ట్రాక్టర్లు, వాటి ధర, పనిచేసే సామర్థ్యం వగైరా వివరాలు ఫిబ్రవరి ‘అన్నదాత’లో మీ కోసం...

మరెన్నో ఆసక్తికర కథనాలు అన్నదాత ఫిబ్రవరి-2022 సంచికలో...
‘అన్నదాత’ చందాదారులుగా చేరడానికి సంప్రదించాల్సిన ఫోన్‌ నెం: 9121157979, 8008522248
(ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు