ఆదివాసీల సమస్యలకు సత్వర పరిష్కారం: కేటీఆర్‌

ఆదివాసీ గిరిజనుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం సత్వరమే పరిష్కరిస్తుందని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెరాస ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గిరిజన తండాలను, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చి పరిపాలనాధికారాన్ని

Published : 27 Jan 2022 05:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆదివాసీ గిరిజనుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం సత్వరమే పరిష్కరిస్తుందని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెరాస ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గిరిజన తండాలను, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చి పరిపాలనాధికారాన్ని ప్రజలకు దగ్గరగా చేసిందని, అటవీ భూములు, ఇతర అంశాలపై సానుకూలంగా నిర్ణయం తీసుకొందన్నారు. ఆదివాసీలకు అవసరమైన వైద్య, విద్యా సదుపాయాల కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎమ్మెల్యే అత్రం సక్కుల నేతృత్వంలో తెరాస ఆదివాసీ ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులు కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి వారి సమస్యలు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివాసీలకు విద్య, వైద్య విషయాల్లో నాణ్యమైన సేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన నేతలు జోగు రామన్న తదితరులతో మాట్లాడుతూ సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పునరుద్ధరణకు కోసం దిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని