ఎఫ్‌బీవో మహేశ్‌పై శాఖాపరమైన చర్యలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సాకివాగులో ఆదివాసీ మహిళలపై చోటుచేసుకున్న ఘటనపై రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

Updated : 28 Jan 2022 05:49 IST

ములకలపల్లి, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సాకివాగులో ఆదివాసీ మహిళలపై చోటుచేసుకున్న ఘటనపై రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ నెల 19న కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన ఇద్దరు బాలికలు, ఇద్దరు మహిళలపై గుండాలపాడు ఎఫ్‌బీవో మహేశ్‌ దాడిచేయడమే గాకుండా ఓ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు మహేశ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన్ను పాల్వంచ అటవీ శాఖ డివిజనల్‌ కార్యాలయానికి ఎటాచ్‌ చేస్తూ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎఫ్‌ఆర్‌వో రవికిరణ్‌ గురువారం తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఆయనపై తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని