నీటి వినియోగం ఎంత.. పూడిక పరిస్థితి ఏమిటి?

జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణా నదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టు పరిధిలో నీటి వినియోగం, భద్రతపై గురువారం కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) బృందం పరిశీలించింది. నెట్టెంపాడు

Published : 28 Jan 2022 04:38 IST

జూరాల ప్రాజెక్టుపై కేఆర్‌ఎంబీ బృందం ఆరా

ధరూరు, న్యూస్‌టుడే : జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణా నదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టు పరిధిలో నీటి వినియోగం, భద్రతపై గురువారం కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) బృందం పరిశీలించింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకుంది. కేఆర్‌ఎంబీ సభ్యుడు రవికుమార్‌ పిళ్లై, ఎస్‌ఈ అశోక్‌కుమార్‌లు మొదట జూరాల ప్రాజెక్టును పరిశీలించి జలాశయంలో నీటి నిల్వ, పూడిక పరిస్థితిపై ప్రాజెక్టుల సీఈ రఘునాథ్‌రావును అడిగి తెలుసుకున్నారు. పూడిక వల్ల నీటి సామర్థ్యం తగ్గుతున్న దానిపై ప్రశ్నించారు. గేట్ల ద్వారా నీరు వృథాగా వెళ్తుండటాన్ని గమనించి, గేట్ల మరమ్మతులకు ఏం చర్యలు తీసుకుంటున్నారని అడిగారు. ప్రాజెక్టు భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెట్టెంపాడు లిఫ్ట్‌-1ను పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని