ఆన్‌లైన్‌ విచారణ కుదరదు

సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తిరస్కరించింది. తెలంగాణ తరఫున వ్యవసాయంపై సాక్షిగా ఉన్న పళనిస్వామి వాదనలను ఆంధ్రప్రదేశ్‌ తరపు న్యాయవాది క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేస్తున్నారు

Published : 28 Jan 2022 04:37 IST

తెలంగాణ విజ్ఞప్తిని తోసిపుచ్చిన బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌

ఈనాడు, హైదరాబాద్‌: సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తిరస్కరించింది. తెలంగాణ తరఫున వ్యవసాయంపై సాక్షిగా ఉన్న పళనిస్వామి వాదనలను ఆంధ్రప్రదేశ్‌ తరపు న్యాయవాది క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పళనిస్వామి తల్లి అనారోగ్యంతో ఉన్నారని, ఈయనకు కూడా 78 ఏళ్ల వయసు కావడంతో కోయంబత్తూరు నుంచి ఆన్‌లైన్‌లో హాజరవుతారని, అనుమతించాలని దిల్లీలోని బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ను ఇటీవల తెలంగాణ కోరింది. ఈ విజ్ఞప్తిని ట్రైబ్యునల్‌ గురువారం తిరస్కరించింది. ప్రస్తుతానికి పళనిస్వామి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను వాయిదా వేసి మరొక సాక్షి విచారణకు అంగీకరించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు ట్రైబ్యునల్‌ సమాచారమిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని