‘ఓటుకు నోటు కేసు’ విచారణ ఏ స్థితిలో ఉంది?

ఓటుకు నోటు కేసు విచారణ హైకోర్టులో ఏ స్థితిలో ఉందో తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో

Published : 28 Jan 2022 04:39 IST

ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ఈనాడు, దిల్లీ: ఓటుకు నోటు కేసు విచారణ హైకోర్టులో ఏ స్థితిలో ఉందో తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ అనిరుద్ధా బోస్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది. హైకోర్టులో కేసు ఏ స్థితిలో ఉందని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ప్రశ్నించగా.. జూన్‌ 18న కొంత మేరకు కేసు విచారణ జరిగిందని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ అగర్వాల్‌ సమాధానమిచ్చారు.  తాము దానికి సంబంధించి అక్కడ అఫిడవిట్‌ కూడా దాఖలు చేశామని, ఆగస్టు 21 తర్వాత కేసు విచారణకు రాలేదని చెప్పారు. ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి హైకోర్టులో ఏం జరిగింది... కేసు ఏ స్థితిలో ఉందనే దానిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. కేసు నుంచి తన పేరు తొలగించాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ కేసుతో పాటే విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని