దేశవ్యాప్తంగా గోశాలల అభివృద్ధికి తితిదే సహకారం

దేశంలోని వివిధ గోశాలల అభివృద్ధికి సహకారం అందిస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలో నమామి గోవింద పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో

Published : 28 Jan 2022 04:43 IST

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుపతి, న్యూస్‌టుడే: దేశంలోని వివిధ గోశాలల అభివృద్ధికి సహకారం అందిస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలో నమామి గోవింద పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంతో డ్రైఫ్లవర్‌ టెక్నాలజీతో ఆకర్షణీయంగా రూపొందించిన శ్రీవారి ఫొటోలతో పాటు కీ చైన్లు, పేపర్‌ వెయిట్‌ల విక్రయాలను ప్రారంభించారు. తితిదే ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేస్తున్న అగరబత్తీలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ‘నమామి గోవింద’ బ్రాండ్‌ పేరుతో పంచగవ్య ఉత్పత్తుల విక్రయ కేంద్రం గురువారం ప్రారంభమైంది. భక్తులకు ఐదు రకాల పంచగవ్య ఉత్పత్తులైన సబ్బులు, షాంపులు, ధూప్‌ స్టిక్స్‌ తదితరాలను అందుబాటులోకి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.

* అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరాముని ఆలయానికి చేపట్టాల్సిన భద్రతాచర్యలపై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసు ఉన్నతాధికారులు గురువారం తిరుమలలో పర్యటించి అధ్యయనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని