పట్టణ పేదలకు ‘ఉపాధిహామీ’ కావాలి

దేశవ్యాప్తంగా పట్టణాలకు వలస వస్తున్న పేద ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పుతో పాటు వారి ఆదాయ మార్గాలు పెంచేందుకు జాతీయ పట్టణ ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని డిమాండ్‌

Published : 28 Jan 2022 04:46 IST

 నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పట్టణాలకు వలస వస్తున్న పేద ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పుతో పాటు వారి ఆదాయ మార్గాలు పెంచేందుకు జాతీయ పట్టణ ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. వచ్చే బడ్జెట్‌లో ఈ పథకాన్ని చేర్చాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన గురువారం లేఖ రాశారు. ‘2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 31 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తోంది. 2030 నాటికి అది 40 శాతానికి చేరనుంది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో 50 శాతం దాటే అవకాశముంది. దీనిపై అన్ని ప్రభుత్వాలు దృష్టి సారించాలి. పట్టణ పేదలకు గృహనిర్మాణం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత, జీవనోపాధిపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. దేశంలో ఇప్పటికే పలు కమిటీలు, సీఐఐ, పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ ఈ తరహా పథకం ప్రవేశపెట్టాలని సూచించాయి. పేదలు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందుకోవాలంటే ఉపాధి హామీ కల్పించడమే ఏకైక మార్గం’ అని లేఖలో కేటీఆర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని