బాల్య వివాహాల బాధితులకు రిజర్వేషన్లు పరిశీలించండి: హైకోర్టు

బాల్య వివాహాలతో బాధితులైన బాలికలకు విద్యాసంస్థల్లో ఎంతో కొంత రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం సూచించింది. బాల్య వివాహ బాధితుల సంక్షేమం కోసం

Published : 29 Jan 2022 04:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: బాల్య వివాహాలతో బాధితులైన బాలికలకు విద్యాసంస్థల్లో ఎంతో కొంత రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం సూచించింది. బాల్య వివాహ బాధితుల సంక్షేమం కోసం సర్కారు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిపై ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను ముగించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలిల ధర్మాసనం ముందు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలపై కౌంటరు దాఖలు చేసినట్లు చెప్పారు. అన్ని విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్‌ కల్పనపై విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అయినప్పటికీ మహిళా, శిశుసంక్షేమాభివృద్ధి శాఖ బాలికల పాఠశాల విద్య, రక్షణను చూస్తోందన్నారు. ఐసీడీఎస్‌ కింద పౌష్టికాహారం, ఉచిత న్యాయ సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్‌ సాధ్యం కాదని, ఇలా చేస్తే బాల్యవివాహాలను ప్రోత్సహించినట్లవుతుందని చెప్పారు. ఉన్నత విద్యకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టినందున పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని