పర్యావరణ అనుమతుల ముంగిట సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు

గోదావరినదిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మిస్తున్న సీతమ్మసాగర్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనలను నీటిపారుదలశాఖ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు

Published : 29 Jan 2022 04:23 IST

కేంద్రానికి ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరినదిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మిస్తున్న సీతమ్మసాగర్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనలను నీటిపారుదలశాఖ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు సమర్పించింది. శుక్రవారం భద్రాద్రి ముఖ్య ఇంజినీరు ఎ.శ్రీనివాస్‌రెడ్డి అనుమతులకు సంబంధించిన వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కేంద్ర అధికారులకు వివరించారు. గోదావరిపై దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన 200 మీటర్ల దూరంలో సీతమ్మసాగర్‌ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. 36.57 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.2,700 కోట్లు కాగా 3,244 ఎకరాలు ముంపునకు గురికానున్నాయి. 320 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లను కూడా నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని