Telangana News: కాళేశ్వరం జలాలతో పండిన పంట..సీఎం సహాయనిధికి రైతు విరాళం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్‌రెడ్డి అనే యువ రైతు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.పదివేల సాయం అందజేశారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు....

Updated : 29 Jan 2022 09:13 IST

తొలి ఆదాయం నుంచి రూ.పదివేలు సీఎంకు అందజేత

ఈనాడు, హైదరాబాద్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివాస్‌రెడ్డి అనే యువ రైతు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.పదివేల సాయం అందజేశారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. ‘‘ఇంతక్రితం దాకా నా వ్యవసాయ భూమి బీడుగా ఉంది. ఇప్పుడు కాళేశ్వర జలాల సాయంతో పంటలు పండిస్తూ ఆదాయాన్ని పొందుతున్నా. నేను పండించిన పంటలో కొంత భాగాన్ని పేదలకోసం ఖర్చు చేయాలని నిర్ణయించా. మొదటి పంట ద్వారా వచ్చిన మొత్తం నుంచి రూ.పదివేలను విరాళంగా అందజేస్తున్నా. రెండో పంట నుంచి కూడా రూ.పదివేల చొప్పున ఇస్తా’’ అని సీఎంకు తెలిపారు. కేసీఆర్‌ శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు. ‘‘సామాజిక బాధ్యతగా కొంత మొత్తాన్ని కేటాయించాలనుకోవడం గొప్ప విషయం. శ్రీనివాస్‌రెడ్డి స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి’’ అని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ‘‘ప్రభుత్వం చేపట్టిన సాగునీరు, విద్యుత్‌ రంగాల అభివృద్ధితో తెలంగాణ యువత వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవడం సంతోషకరం. ఏదో సంస్థలో అరకొర జీతానికి పనిచేస్తే చాలు అనే ధోరణి నుంచి బయటపడి శ్రీనివాస్‌రెడ్డి వంటి వారు స్వగ్రామాల్లోనే పచ్చని పంటపొలాల నడుమ ప్రకృతిలో భాగమవుతున్నారు. ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ వ్యవసాయాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుని పదిమందికి పని కల్పిస్తున్నారు’’ అని సీఎం అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని