సింగరేణిలో ‘పెండింగ్‌లో ఉన్న’ వారసులకు ఉద్యోగాలు

కొన్ని నిబంధనల కారణంగా వారసత్వ ఉద్యోగాలు దక్కక పెండింగులో ఉన్న వారికి సింగరేణి యాజమాన్యం తీపికబురు చెప్పింది. 2014 జూన్‌ 1 నుంచి 2022 ఏప్రిల్‌ 19 వరకు పెండింగ్‌లో ఉన్న వారందరికీ ఉద్యోగాలిస్తామని బుధవారం ఉత్తర్వులిచ్చింది.

Updated : 19 May 2022 06:09 IST

గోదావరిఖని, న్యూస్‌టుడే: కొన్ని నిబంధనల కారణంగా వారసత్వ ఉద్యోగాలు దక్కక పెండింగులో ఉన్న వారికి సింగరేణి యాజమాన్యం తీపికబురు చెప్పింది. 2014 జూన్‌ 1 నుంచి 2022 ఏప్రిల్‌ 19 వరకు పెండింగ్‌లో ఉన్న వారందరికీ ఉద్యోగాలిస్తామని బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్‌ 19న ఆర్‌ఎల్‌సీ సమక్షంలో నిర్వహించిన చర్చల్లో యాజమాన్యం వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద.. ‘పెండింగ్‌’ వారసులకు ఉద్యోగాలిస్తామని అంగీకరించింది. సింగరేణి ఉద్యోగి జీవిత భాగస్వామి ప్రభుత్వోద్యోగి అయితే.. వారి పిల్లలకు వారసత్వ ఉద్యోగానికి అర్హత ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి వారికి ఉద్యోగాలు దక్కనున్నాయి. మెడికల్‌ బోర్డు నిర్వహించడంలో జాప్యం వల్ల వయోపరిమితి 35 ఏళ్లు దాటిపోవడంతో ఉద్యోగం దక్కని వారి విషయంలోనూ సింగరేణి సానుకూలంగా స్పందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని