తోకలేని ఎలకలు.. చూపులకు కుందేళ్లు!

కుందేళ్ల మాదిరిగా ముచ్చటగా కనిపిస్తున్న ఈ ప్రాణుల్ని గినియా పిగ్స్‌ అంటారు. కరీంనగర్‌లోని జింకల పార్కులో వీటిని పెంచుతున్నారు.

Published : 19 May 2022 05:38 IST

కుందేళ్ల మాదిరిగా ముచ్చటగా కనిపిస్తున్న ఈ ప్రాణుల్ని గినియా పిగ్స్‌ అంటారు. కరీంనగర్‌లోని జింకల పార్కులో వీటిని పెంచుతున్నారు. విభిన్న వర్ణాల్లో ఉండటంతో ఇవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కరీంనగర్‌ మహిళా డిగ్రీ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(జువాలజీ) ఎన్‌.సంగీతారాణి వీటి గురించి వివరించారు. గినియా పిగ్స్‌ 16వ శతాబ్దం నుంచీ కనబడుతున్నాయన్నారు. ఇవి కావిడే కుటుంబంలోని కేవియా జాతికి చెందిన ఎలుకలని, మూడు నెలలకు ఒక ఈత చొప్పున సంతానాన్ని వృద్ధి చేస్తాయని వివరించారు. ఇవి శాకాహారులని, తోకలుండవని వీటిని దక్షిణ అమెరికాలో ఇళ్లలో పెంచుకుంటారని ఆమె తెలిపారు.

- ఈనాడు, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని