ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ఆరోగ్యశ్రీ సేవలు: మంత్రి హరీశ్‌

రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు 8 శాతం పెరిగాయని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇంకా సర్జరీలు పెంచాలని, వైద్యపరికరాల వినియోగం పూర్తి స్థాయిలో

Updated : 20 May 2022 05:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు 8 శాతం పెరిగాయని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇంకా సర్జరీలు పెంచాలని, వైద్యపరికరాల వినియోగం పూర్తి స్థాయిలో ఉండాలని పేర్కొన్నారు. గురువారమిక్కడ ఆరోగ్యశ్రీ పథకం అమలుపై వైద్యశాఖ ఉన్నతాధికారులు రిజ్వీ, రమేశ్‌రెడ్డి, శ్రీనివాసరావు, అజయ్‌కుమార్‌తో కలసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2019-20లో ఆరోగ్యశ్రీ సేవలు 35 శాతముంటే.. 2021-22 నాటికి 43 శాతానికి పెరిగాయన్నారు. జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు చేయాలని, అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. మోకీలు ఆపరేషన్లు నిర్వహించాలని.. ఇందుకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల సహకారం తీసుకోవాలని సూచించారు. అసుపత్రుల సమీప ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రసూతి ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని కోరారు. వైద్యాధికారులు ఆరోగ్యశ్రీ సేవలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సూచించారు. రోడ్డుప్రమాదంలో చనిపోయిన సిద్దిపేట జిల్లా లదునూర్‌ పీహెచ్‌సీ ఏఎన్‌ఎం రామడుగు రేణుక కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి హరీశ్‌ తెలిపారు. రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు పిల్లల్ని చదివిస్తామన్నారు. ఆమె భర్తకు పొరుగుసేవల కింద ఉద్యోగాన్ని కల్పిస్తామని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని