T20 League: వెల్‌డన్‌ గుజరాత్‌.. హార్దిక్‌ నువ్వో ఛాంపియన్‌

టీ20 మెగా టోర్నీలో అరంగేట్రంలోనే అదరహో అనిపించింది గుజరాత్‌. తొలి మ్యాచ్‌ నుంచి సమష్టిగా రాణిస్తూ టాప్‌లో నిలిచిన హార్దిక్‌ సేన.. తుది సమయంలోనూ అదరగొట్టింది. గత రాత్రి రాజస్థాన్‌లో జరిగిన ఫైనల్‌లో బంతితో,

Updated : 30 May 2022 11:49 IST

గుజరాత్‌ జట్టుపై ప్రశంసల వెల్లువ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 మెగా టోర్నీలో అరంగేట్రంలోనే అదరహో అనిపించింది గుజరాత్‌. తొలి మ్యాచ్‌ నుంచి సమష్టిగా రాణిస్తూ టాప్‌లో నిలిచిన హార్దిక్‌ సేన.. తుది పోరులోనూ అదరగొట్టింది. గత రాత్రి రాజస్థాన్‌లో జరిగిన ఫైనల్‌లో బంతితో, బ్యాటుతో చెలరేగి తొలి సీజన్‌లోనే కప్పును ముద్దాడింది. దీంతో గుజరాత్‌ జట్టుపై సోషల్‌మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. మాజీ, ప్రస్తుత క్రికెటర్లు హార్దిక్‌ సేనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నిన్న రాత్రి జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ హార్ది్‌క్‌ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. మూడు వికెట్లు తీయడంతోపాటు 34 పరుగులతో రాణించాడు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ను గుజరాత్‌ కేవలం 130 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఛేదనకు దిగిన హార్దిక్‌ జట్టు.. 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి కప్పును ముద్దాడింది.

* కచ్చితంగా ఈ టోర్నమెంట్‌లో అత్యంత నిలకడ ఉన్న జట్టు ఇదే. అందుకే టైటిల్‌ సాధించగలిగింది. అభినందనలు గుజరాత్‌ - సచిన్‌ తెందూల్కర్‌

* గుజరాత్‌కు అద్భుతమైన అరంగేట్రం. కెప్టెన్‌గా, ఆటగాడిగా హార్దిక్‌ పాండ్యా గొప్పగా ఆడాడు. అత్యద్భుతంగా సాగిన ఈ మెగా టోర్నీలో కొత్త ఛాంపియన్‌ను చూడటం గొప్పగా ఉంది. రాజస్థాన్‌ కూడా తన ఆట పట్ల గర్వపడొచ్చు - వీరేంద్ర సెహ్వాగ్‌

* వెల్‌డన్ గుజరాత్‌. ఆద్యంతం అద్భుతంగా ఆడారు. హార్దిక్‌ నువ్వో ఛాంపియన్‌వి - దినేశ్ కార్తిక్‌

* హార్దిక్‌ పాండ్యా, గుజరాత్‌ జట్టుకు అభినందనలు. అరంగేట్ర సీజన్‌లో.. సొంత గడ్డపై వేలాది మంది అభిమానుల ముందు విజేతగా నిలవడం నిజంగా గొప్ప క్షణాలు - బీసీసీఐ సెక్రటరీ జై షా

* గుజరాత్‌కు అద్భుతమైన తొలి సీజన్‌. హార్దిక్‌ పాండ్యాకు అభినందనలు - ఛతేశ్వర్‌ పుజారా






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని