Dhoni - Conway: ధోనీ కెప్టెన్సీలో ఆడాలనుకున్నా.. కానీ నో చెప్పాడు: కాన్వే

చెన్నై మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సారథ్యంలో ఈసారి మెగా టీ20 లీగ్‌లో ఆడాలనుకున్నట్లు ఆ జట్టు ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే వెల్లడించాడు. తాజాగా చెన్నై టీమ్‌ పంచుకున్న ఓ వీడియోలో ఈ న్యూజిలాండ్...

Updated : 31 Mar 2022 11:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సారథ్యంలో ఈ సారి మెగా టీ20 లీగ్‌లో ఆడాలనుకున్నట్లు ఆ జట్టు ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే వెల్లడించాడు. తాజాగా చెన్నై టీమ్‌ పంచుకున్న ఓ వీడియోలో ఈ న్యూజిలాండ్‌ బ్యాటర్‌ తన కోరికను బయటపెట్టడంతో పాటు కొద్దిరోజుల క్రితం ధోనీతో మాట్లాడిన విషయాలను కూడా పంచుకున్నాడు. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్‌గా బరిలోకి దిగిన కాన్వే 8 బంతులాడి కేవలం 3 పరుగులే చేశాడు. దీంతో తర్వాతి మ్యాచ్‌లోనైనా రాణించాలని ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు మాట్లాడుతూ ధోనీ సారథ్యంలో ఆడాలనుకున్నట్లు చెప్పాడు.

‘‘నేను మహీ కెప్టెన్సీలో ఆడాలనుకున్నా. ఈ విషయంపై అతడితో చర్చించాను కూడా. మీరు కచ్చితంగా కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నారా?ఈ ఒక్క సీజన్‌ కూడా కెప్టెన్సీ చేయలేరా? అలా చేస్తే నేను మీ సారథ్యంలో ఆడే అవకాశం ఉంటుంది’ అని అడిగాను. అప్పుడు అతడు స్పందిస్తూ.. నేను కెప్టెన్‌గా ఉండను. కానీ, ఎప్పుడూ జట్టుతోనే కలిసి ఉంటానని వెల్లడించాడు’’ అని కాన్వే చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సీజన్‌కు రెండు రోజుల ముందు ధోనీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆ బాధ్యతలను ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు అప్పగించాడు. దీంతో జడ్డూ చెన్నై జట్టును నడిపిస్తున్నాడు. అయితే, కోల్‌కతాతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు టాప్‌ ఆర్డర్‌ విఫలమై తక్కువ స్కోరే సాధించింది. దీంతో మ్యాచ్‌ కోల్పోయి ఓటమితో ఈ సీజన్‌ను ఆరంభించింది. ఇక నేడు చెన్నై.. లఖ్‌నవూతో తలపడనుంది. ఈసారి పరుగులు చేయాలని ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ పట్టుదలగా ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని