Dhoni: అభిమాని లేఖకు ధోనీ ఎలా స్పందించాడంటే..?

చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఎప్పుడూ అభిమానులను అలరిస్తూనే ఉంటాడు. ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్లని సంతోషపెడుతుంటాడు...

Published : 19 May 2022 02:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఎప్పుడూ అభిమానులను అలరిస్తూనే ఉంటాడు. ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్లని సంతోషపెడుతుంటాడు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ అభిమాని ధోనీపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ దానిని అక్షరరూపంలో మార్చి ఓ లేఖ రాశాడు. దాన్ని ధోనీకి చేరేలా చేశాడు. చివరికి అది చదివి సంతోషించిన చెన్నై కెప్టెన్‌ చాలా అద్భుతంగా రాశావంటూ మెచ్చుకున్నాడు. ఆ లేఖపై సంతకం కూడా పెట్టాడు. దీంతో చెన్నై టీమ్‌ ఆ లేఖను ఫ్రేమ్‌గా మలచి ఆ ఫొటోలను ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని