Yuzvendra Chahal: ఆరోజు చావు నుంచి బయటపడ్డా: చాహల్‌

రాజస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టాడు. 2013 లో ఓ ఆటగాడి నిర్వాకం వల్ల చావు నుంచి త్రుటిలో బయటపడినట్లు వెల్లడించాడు. ఆ క్రికెటర్‌ బాగా తాకిన మైకంలో

Updated : 09 Apr 2022 07:08 IST

ముంబయి: రాజస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టాడు. 2013లో ఓ ఆటగాడి నిర్వాకం వల్ల చావు నుంచి త్రుటిలో బయటపడినట్లు వెల్లడించాడు. ఆ క్రికెటర్‌ బాగా తాగిన మైకంలో తనను 15వ అంతస్తులో వేలాడదీసినట్లు తోటి ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్‌ వెల్లడించాడు. ‘‘నా కథ కొందరికి తెలుసు. దాని గురించి గతంలో ఎప్పుడూ మాట్లాడలేదు. ఎవరితోనూ పంచుకోలేదు. 2013లో ముంబయికు ఆడుతున్నా. బెంగళూరులో మ్యాచ్‌ తర్వాత పార్టీ జరిగింది. ఒక ఆటగాడు బాగా తాగాడు. అతని పేరు చెప్పదల్చుకోలేదు. బాగా తాగిన అతను చాలాసేపు నన్ను చూశాడు. తన దగ్గరికి రమ్మని పిలిచాడు. నన్ను బాల్కనీలోకి తీసుకెళ్లి కిందకి వేలాడదీశాడు. అప్పుడు నా చేతులతో అతడిని గట్టిగా పట్టుకున్నా. అది 15వ అంతస్తు. ఏమాత్రం పట్టు తప్పినా నా పనైపోయేది. వెంటనే అక్కడున్న వాళ్లంతా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొద్దిసేపు నేను స్పృహ తప్పాను. నాకు నీళ్లు ఇచ్చారు. బయటకు వెళితే ఎంత బాధ్యతగా ఉండాలో అప్పుడు తెలిసింది. ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్న సంఘటన అది. చిన్న పొరపాటు జరిగినా కిందపడిపోయేవాడిని. ప్రాణాలతో బయటపడేవాడిని కాదు’’ అని చాహల్‌ గుర్తుచేసుకున్నాడు. 2013లో ముంబయి తరఫున ఒకేఒక్క మ్యాచ్‌ ఆడిన చాహల్‌.. 2014లో బెంగళూరుకు మారాడు. ఇక ఈ సీజన్‌లో రాజస్థాన్‌ తరఫున ఆడుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని