Rishabh Pant - Dhoni: పంత్‌లో ధోనీ లక్షణాలు కనిపిస్తున్నాయి: కుల్‌దీప్‌

దిల్లీ జట్టు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌లో దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీ లక్షణాలు కనిపిస్తున్నాయని స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు. జట్టులో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు.

Updated : 25 Apr 2022 08:42 IST

దిల్లీ: దిల్లీ జట్టు కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌లో దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీ లక్షణాలు కనిపిస్తున్నాయని స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అన్నాడు. జట్టులో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు. మునుపటి ఫామ్‌తో అదరగొడుతున్న కుల్‌దీప్‌ సీజన్‌లో ఇప్పటికే 13 వికెట్లు పడగొట్టాడు. ‘‘వికెట్ల వెనుక పంత్‌లో ధోనీ లక్షణాలు కనిపిస్తున్నాయి. చక్కగా మార్గనిర్దేశం చేస్తున్నాడు. మైదానంలో ప్రశాంతంగా ఉంటున్నాడు. స్పిన్నర్ల విజయంలో వికెట్‌ కీపర్లదే కీలకపాత్ర. ఈ సీజన్‌లో నా ప్రదర్శన ఘనతలో పంత్‌కూ వాటా దక్కుతుంది. మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. భావ వ్యక్తీకరణ స్వేచ్చ లభించినప్పుడు ప్రతీదాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తాం. ప్రాక్టీస్‌ సెషన్‌లో కోచ్‌ పాంటింగ్‌తో మాట్లాడా. నేను చక్కగా బౌలింగ్‌ చేస్తున్నట్లు అతను చెప్పాడు. ఈ సీజన్‌లో నేను 14 మ్యాచ్‌ల్లో ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఆ సంభాషణ నాకెంతో ప్రేరణగా నిలిచింది’’ అని కుల్‌దీప్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని