టీ20 క్రికెట్‌ మెగా లీగ్‌ భిన్న మార్గాల్ని చూపించింది

క్రికెట్లో విజయం సాధించడానికి టీ20 మెగా లీగ్‌ భిన్న మార్గాల్ని చూపించిందని స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. తను ఆటపై అవగాహన పెంచుకోడానికి భిన్నమైన కోణాన్ని

Updated : 05 May 2022 05:02 IST

ముంబయి: క్రికెట్లో విజయం సాధించడానికి టీ20 మెగా లీగ్‌ భిన్న మార్గాల్ని చూపించిందని స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. తను ఆటపై అవగాహన పెంచుకోడానికి భిన్నమైన కోణాన్ని జోడించిందని తెలిపాడు. 2008 నుంచి బెంగళూరు తరఫున ఆడుతున్న కోహ్లి.. అత్యధికంగా 6499 పరుగులు రాబట్టాడు. ‘‘టీమ్‌ఇండియా కాకుండా నా సామర్థ్యాల ప్రదర్శనకు వేదికగా నిలిచింది ఈ మెగా లీగే. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీపడటంతో పాటు వారితో జ్ఞానాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పించింది. భిన్నమైన కోణం ద్వారా ఆటపై అవగాహన పెంచుకోవడానికి దోహదపడటం అత్యంత ముఖ్యమైన విషయం. ఈ టీ20 లీగ్‌ లేకపోయుంటే భిన్న పరిస్థితుల్లో విభిన్నమైన ఆలోచన విధానాలతో ఉండే ఆటగాళ్లను చదవగలిగే వాడిని కాదు’’ అని కోహ్లి వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని