Virender Sehwag: డేవిడ్‌ వార్నర్‌ ప్రాక్టీస్‌ తక్కువ.. పార్టీలు ఎక్కువ: సెహ్వాగ్‌

వీరేంద్ర సెహ్వాగ్‌ 2009లో దిల్లీ కెప్టెన్‌. ఆ సీజన్‌కు ఆ జట్టుతో ఉన్న వార్నర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు వీరూ. అప్పుడు వార్నర్‌ను నియంత్రించడం కష్టమైందని, అతడు డ్రెస్సింగ్‌రూమ్‌లో కొన్నిసార్లు గొడవలు పడ్డాడని తెలిపాడు.

Updated : 08 May 2022 07:47 IST

దిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్‌ 2009లో దిల్లీ కెప్టెన్‌. ఆ సీజన్‌కు ఆ జట్టుతో ఉన్న వార్నర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు వీరూ. అప్పుడు వార్నర్‌ను నియంత్రించడం కష్టమైందని, అతడు డ్రెస్సింగ్‌రూమ్‌లో కొన్నిసార్లు గొడవలు పడ్డాడని తెలిపాడు. ‘‘నేను కూడా కొందరు ఆటగాళ్లపై అసహనం వ్యక్తం చేశాను. అందులో వార్నర్‌ కూడా ఉన్నాడు. జట్టుతో చేరిన కొత్తలో అతడు ప్రాక్టీస్‌, మ్యాచ్‌ల కంటే పార్టీలకే ప్రాధాన్యం ఇచ్చేవాడు. కొందరు ఆటగాళ్లతో గొడపడడంతో చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆడనివ్వకుండా అతణ్ని ఇంటికి పంపించాం. పాఠం చెప్పాలంటే కొన్నిసార్లు కొందరిని పక్కన పెట్టక తప్పదు. అతడు అప్పుడు జట్టుకు కొత్త. ‘నువ్వొక్కడివే కాదు.. జట్టులో అందరూ ముఖ్యం’ అని చూపించడం చాలా ముఖ్యం. ఆడి జట్టును గెలిపించే ఆటగాళ్లు ఇంకా ఉన్నారు. వార్నర్‌ను దూరం పెట్టి  మేం గెలిచాం కూడా’’ అని సెహ్వాగ్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని