Chris Gayle: ఈసారి భారత టీ20 లీగ్‌లో క్రిస్‌గేల్‌ ఎందుకు లేడంటే..

మెగా టోర్నీలో ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడిన గేల్‌ ఈసారి జరుగుతున్న మెగా టోర్నీలో లేడు. మెగా టోర్నీ మెగా వేలం నుంచి ఎందుకు వైదొలిగాడో తెలియదు.

Updated : 08 May 2022 06:58 IST

ముంబయి: భారత టీ20 మెగా టోర్నీలో ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడిన క్రిస్‌గేల్‌ ఈసారి 15వ సీజన్‌లో ఆడటం లేడు. ఈసారి అసలు వేలంలోనే పాల్గొనలేదు. అయితే, అతడు ఎందుకు వైదొలిగాడో మాత్రం కారణం తెలియదు. తాజాగా తన నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించాడు. గత కొన్నేళ్లలో ఈ టోర్నీలో సరైన గౌరవం దక్కకపోవడం వల్లే ఈసారి దూరంగా ఉన్నానని చెప్పాడు. ‘‘గత కొన్నేళ్లలో భారత టీ20 టోర్నీలో నాకు సరైన గౌరవం దక్కలేదనిపించింది. ఇన్నేళ్లు ఈ టోర్నీలో ఇంత చేశాక అలా జరగడంతో వేలంలో ఉండకూడదనుకున్నా. క్రికెట్‌ కాకుండా ఇంకా చాలా జీవితం ఉంది’’ అని అతడు పేర్కొన్నాడు. అయితే వచ్చే ఏడాది మళ్లీ మెగా టోర్నీలో ఆడతానని చెప్పాడు. ‘‘వచ్చే సంవత్సరం తిరిగి టీ20 మెగా టోర్నీ ఆడతా. వాళ్లకు నా అవసరం ఉంది’’ అని అన్నాడు. గేల్‌ ఈ మెగా టీ20 లీగ్‌లో ఇదివరకు కోల్‌కతా, బెంగళూరు, పంజాబ్‌ జట్ల తరఫున ఆడాడు. 2021 మెగా టోర్నీలో పంజాబ్‌ తరఫున 10 మ్యాచ్‌ల్లో 125.32 స్ట్రైక్‌రేట్‌తో 193 పరుగులు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని