Bangalore vs Gujarat: కోహ్లీ మెరిసె.. బెంగళూరు మురిసె..

బెంగళూరు మురిసింది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటూ తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో గురువారం 8 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. హార్దిక్‌ పాండ్య (62 నాటౌట్‌; 47 బంతుల్లో 4×4, 3×6) రాణించడంతో మొదట గుజరాత్‌ 5

Updated : 20 May 2022 06:55 IST

చివరి లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం
ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం
ముంబయి

బెంగళూరు మురిసింది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటూ తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో గురువారం 8 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. హార్దిక్‌ పాండ్య (62 నాటౌట్‌; 47 బంతుల్లో 4×4, 3×6) రాణించడంతో మొదట గుజరాత్‌ 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. మిల్లర్‌ (34; 25 బంతుల్లో 3×6), సాహా (31; 22 బంతుల్లో 4×4, 1×6) రాణించారు. హేజిల్‌వుడ్‌ (2/39), హసరంగ (1/25), మ్యాక్స్‌వెల్‌ (1/28) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. విరాట్‌ కోహ్లి (73; 54 బంతుల్లో 8×4, 2×6), డుప్లెసిస్‌ (44; 38 బంతుల్లో 5×4), మ్యాక్స్‌వెల్‌ (40 నాటౌట్‌; 18 బంతుల్లో 5×4, 2×6) మెరవడంతో లక్ష్యాన్ని బెంగళూరు 18.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్‌ బెంగళూరుకు బలమైన పునాది వేశారు. 15వ ఓవర్లో డుప్లెసిస్‌ ఔటయ్యేటప్పటికి స్కోరు 115. బెంగళూరు సాధించాల్సిన రన్‌రేట్‌ దాదాపు పది ఉండడంతో ఆ జట్టుపై ఒత్తిడి తేవచ్చని గుజరాత్‌ భావించి ఉంటుంది. కానీ మ్యాక్స్‌వెల్‌ ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో సమీకరణాన్ని తేలిక చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నంలో కోహ్లి స్టంపౌటైనా.. దినేశ్‌ కార్తీక్‌ (2 నాటౌట్‌)తో కలిసి మ్యాక్స్‌వెల్‌ లక్ష్యాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో గుజరాత్‌ (20 పాయింట్లు) లీగ్‌ దశను ముగించింది. ఎనిమిదో విజయం సాధించిన బెంగళూరు   16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. బెంగళూరు ప్లేఆఫ్స్‌ చేరుతుందా లేదా అన్నది శనివారం ముంబయి - దిల్లీ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడి ఉంది. ఆ మ్యాచ్‌లో దిల్లీ ఓడిపోవాలని బెంగళూరు కోరుకోవాలి. లేదంటే ముందంజ వేయడం కష్టం. బెంగళూరు రన్‌రేట్‌లో చాలా వెనుకబడి ఉంది.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా రనౌట్‌ 31; శుభ్‌మన్‌ గిల్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) హేజిల్‌వుడ్‌ 1; వేడ్‌ ఎల్బీ (బి) మ్యాక్స్‌వెల్‌ 16; హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 62; మిల్లర్‌ (సి) అండ్‌ (బి) హసరంగ 34; రాహుల్‌ తెవాతియా (సి) కార్తీక్‌ (బి) హేజిల్‌వుడ్‌ 2; రషీద్‌ ఖాన్‌ నాటౌట్‌ 19; ఎక్స్‌ట్రాలు 3; 

మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 168;

వికెట్ల పతనం: 1-21, 2-38, 3-62, 4-123, 5-132;

బౌలింగ్‌: కౌల్‌ 4-0-43-0; షాబాజ్‌ అహ్మద్‌ 2-0-15-0; హేజిల్‌వుడ్‌ 4-0-39-2; మ్యాక్స్‌వెల్‌ 4-1-28-1; లొమ్రార్‌ 1-0-11-0; హసరంగ 4-0-25-1; హర్షల్‌ 1-0-6-0

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (స్టంప్డ్‌) వేడ్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 73; డుప్లెసిస్‌ (సి) హార్దిక్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 44; మ్యాక్స్‌వెల్‌ నాటౌట్‌ 40; దినేశ్‌ కార్తీక్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 11

మొత్తం: (18.4 ఓవర్లలో 2 వికెట్లకు) 170;

వికెట్ల పతనం: 1-115, 2-146;

బౌలింగ్‌: షమి 2-0-23-0; హార్దిక్‌ పాండ్య 3-0-35-0; రషీద్‌ ఖాన్‌ 4-0-32-2; యశ్‌ దయాల్‌ 4-0-35-0; సాయి కిశోర్‌ 4-0-20-0; ఫెర్గూసన్‌ 1.4-0-21-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని