Theekshana : అప్పుడు 107 కేజీలు ఉండేవాడిని.. చెన్నై తీసుకుంటుందని అనుకోలేదు: తీక్షణ

చెన్నై జట్టులో నమ్మదగ్గ స్పిన్నర్లలో శ్రీలంక క్రికెటర్‌ మహీశ్ తీక్షణ ఒకడు. పవర్‌ప్లే ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయగల సమర్థుడు. టీ20 లీగ్‌లో తొలి సీజన్‌ ఆడుతున్న...

Published : 12 May 2022 01:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెన్నై జట్టులో నమ్మదగ్గ స్పిన్నర్లలో శ్రీలంక క్రికెటర్‌ మహీశ్ తీక్షణ ఒకడు. పవర్‌ప్లే ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయగల సమర్థుడు. టీ20 లీగ్‌లో తొలి సీజన్‌ ఆడుతున్న తీక్షణ ఎనిమిది మ్యాచుల్లో 7.41 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన 4/33. ఈ క్రమంలో చెన్నై జట్టులోకి రాకముందు తన కెరీర్‌ ఎలా ఉందో తీక్షణ వివరించాడు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై యాజమాన్యం సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

‘‘అండర్ -19 ఆడే సమయంలో 107 కేజీల బరువు ఉండేవాడిని. దీంతో చాలా కష్టపడి బరువును తగ్గించా. యో యో టెస్టు సమయంలో నా చర్మం ముడతలు పడిపోయేది. 2020లో ఫిట్‌నెస్‌ సాధించాను. శరీరం మళ్లీ బరువు పెరగకుండా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. 2021లో శ్రీలంక తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో ఓ వన్డేలో మ్యాచ్‌ ఆడే ఛాన్స్‌ దక్కింది. ఇక శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజింతా మెండిస్‌ గత మూడేళ్లుగా నాకు కోచింగ్‌ ఇస్తున్నాడు. ఇక చెన్నై తరఫున గతేడాదిలోనూ జట్టుతోపాటు ఉన్నా.. నెట్‌ బౌలర్‌గా మాత్రమే. 2022లో ధోనీతో మాట్లాడాను. అయితే మెగా వేలంలో చెన్నై జట్టు నన్ను తీసుకుంటుందని అనుకోలేదు’’ అని తెలిపాడు. 

‘‘2017-18 సమయంలో అండర్‌-19 జట్టులో ఉన్నా. అయితే అధిక బరువు వల్ల ఫిట్‌నెస్‌ను నిరూపించుకోలేక బెంచ్‌కే పరిమితయ్యా. 2019లోనూ పది మ్యాచ్‌లకు వాటర్‌బాయ్‌గా పని చేశా. మరోసారి ఫిట్‌నెస్‌ టెస్టులో ఫెయిల్‌ అయితే వాటర్‌ బాటిల్స్‌ను మోసుకెళ్లాల్సి వస్తుందని అప్పుడే అనుకున్నా. అయితే ఆత్మవిశ్వాసంతో కృషి చేశా. అందుకే 2022లో ఇలా మీ ముందున్న’’ అని తీక్షణ వివరించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు