BCCI: గ్రౌండ్స్‌మెన్‌, క్యూరేటర్లకు బీసీసీఐ భారీ నజరానా

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ను బీసీసీఐ దిగ్విజయంగా ముగించింది. మొత్తం 74 మ్యాచ్‌లను ఆరు వేదికల్లో నిర్వహించింది...

Published : 31 May 2022 10:45 IST

(Photo: Jay Shah Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ను బీసీసీఐ దిగ్విజయంగా ముగించింది. మొత్తం 74 మ్యాచ్‌లను ఆరు వేదికల్లో నిర్వహించింది. ముంబయిలోని వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌ స్టేడియాలతో పాటు పుణెలోని ఎంసీఏ క్రికెట్‌ మైదానాన్ని లీగ్ స్టేజ్‌ మ్యాచ్‌లకు ఉపయోగించింది. అలాగే ప్లేఆఫ్స్‌లో రెండు మ్యాచ్‌లను కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో.. క్వాలిఫయర్‌-2, ఫైనల్‌ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం తుదిపోరులో గుజరాత్‌ టీమ్‌ రాజస్థాన్‌ను ఓడించింది.

అయితే, సోమవారం బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ ఆరు మైదానాల సిబ్బందికి భారీ నజరానా ప్రకటించారు. ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లకు అత్యుత్తమ పిచ్‌లు తయారు చేసిన గ్రౌండ్స్‌మెన్‌, క్యూరేటర్లకు రూ.1.25 కోట్ల మొత్తం అందించనున్నట్లు తెలిపారు. ఒక్కో స్టేడియానికి రూ.25 లక్షల చొప్పున.. వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌, పుణె మైదానాల సిబ్బందికి ప్రకటించారు. ఇక రూ.12.5 లక్షల చొప్పున.. ఈడెన్‌గార్డెన్స్‌, నరేంద్రమోదీ స్టేడియాల సిబ్బందికి అందించనున్నట్లు వెల్లడించారు. వీళ్లంతా తెరపైకి కనిపించని నిజమైన హీరోలని షా ప్రశంసించాడు. కాగా, బీసీసీఐ ఇలా గ్రౌండ్స్‌మెన్‌కు నజరానా ప్రకటించడం ఇదే తొలిసారి కాకపోయినా ఇంత మొత్తంలో చెల్లించడం ఇదే మొదటిసారి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు