KL Rahul: ఇంతకుమించి ఎక్కువ ఆశించలేను: కేఎల్ రాహుల్
టీ20 లీగ్‌లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతాపై 75 పరుగుల భారీ విజయం సాధించడంతో లఖ్‌నవూ సారథి కేఎల్ రాహుల్ హర్షం వ్యక్తం చేశాడు...
(Photo: KL Rahul Instagram)
ముంబయి: టీ20 లీగ్‌లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతాపై 75 పరుగుల భారీ విజయం సాధించడంతో లఖ్‌నవూ సారథి కేఎల్ రాహుల్ హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టు నుంచి ఇంతకు మించి మంచి ప్రదర్శన ఆశించలేనని చెప్పాడు. మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ తమ ఆటగాళ్ల ప్రదర్శనను మెచ్చుకున్నాడు.
‘మేం ఈ మ్యాచ్‌లో చాలా అద్భుతంగా ఆడాం. నా రనౌట్ ఒక్కటే నిరాశపర్చింది. క్వింటన్ డికాక్ (50), దీపక్ హూడా (41) ఆడిన తీరు చూస్తే ఇక్కడ పరుగులు తేలిగ్గా చేయొచ్చనే అభిప్రాయం కలిగింది. చివర్లో స్లాయినిస్ (28), జేసన్ హోల్డర్ (13) ధాటిగా ఆడి మంచి స్కోర్ అందించారు. తర్వాత బంతితోనూ మా బౌలర్లు రాణించారు. ఇంతకుమించి వారినుంచి ఎక్కువ ఆశించలేను. ఆటగాళ్లకు నైపుణ్యాలు ఉండటం ఒక్క ఎత్తయితే, వాటిని ఎప్పుడు ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసి ఉండటం కూడా అంతే ముఖ్యం. మరోవైపు కోల్‌కతా బ్యాటింగ్‌లో రస్సెల్ (45) ఆడేటప్పుడు కొన్నిసార్లు భయమేసింది. కానీ, మా బౌలర్లు ప్రణాళికలకు కట్టుబడి బౌలింగ్ చేశారు. అయితే, మేం మెరుగవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కీలక సమయంలో రాణిస్తున్నామో లేదో తెలియదు కానీ, విజయాలు మాత్రం సాధిస్తున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది’ అని రాహుల్ పేర్కొన్నాడు.
అన్ని విధాలా దెబ్బతీశారు: శ్రేయస్
ఇక ఈ ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేసుకున్న కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. లఖ్‌నవూ తమని అన్ని విధాలా దెబ్బతీసిందని చెప్పాడు. ‘వాళ్లు మమ్మల్ని బ్యాటింగ్, బౌలింగ్ పరంగా రెండు విధాలా చిత్తుచేశారు. మేం బౌలింగ్ చేసేటప్పుడు చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులివ్వడమే కాకుండా బ్యాటింగ్‌లో పవర్‌ప్లేలోనే పలు వికెట్లు కోల్పోయి పేలవంగా ఆరంభించాం. పిచ్ ఎలా స్పందిస్తుందన్నది అర్థం చేసుకోలేకపోయాం. అందువల్లే టాస్ గెలిచి కూడా బౌలింగ్ ఎంచుకున్నాం. దీంతో వారిని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించి 160లోపు కట్టడి చేస్తామనుకున్నా. కానీ, చివరికి వాళ్లు చాలా మంచి స్కోర్ సాధించారు. నేనూ, మా కోచ్ ఛేదన గురించే ఆలోచించాం. మధ్య ఓవర్లలో బాగా బౌలింగ్ చేస్తున్నా చివర్లోనే తడబడుతున్నాం. అలాగే పవర్‌ప్లేలోనూ సరిగ్గా ఆడలేకపోతున్నాం. దీంతో రాబోయే మూడు మ్యాచ్‌ల్లో ఈ విషయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్‌లో 12.5, రెండో వాల్ట్‌లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్‌లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!