Virat Kohli: ఎవరైనా కెరీర్ మొత్తం ఒకేలా ఆడలేరు.. కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలి
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని, కుటుంబంతో హాయిగా గడపాలని ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ సూచించాడు. రెండున్నర సంవత్సరాలుగా విరాట్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు జరుగుతోన్న భారత టీ20 లీగ్ 15వ సీజన్లోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే వాన్ ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ విరాట్ కోహ్లీపై స్పందించాడు.
‘కోహ్లీ దిగ్గజ ఆటగాడే కానీ.. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. రెండు, మూడేళ్ల క్రితం కోహ్లీ బరిలోకి దిగుతున్నాడంటే శతకం చేస్తాడనే అంచనాలు ఉండేవి. అంత గొప్ప స్థాయిలో ఆడేవాడు. అయితే, ఎవరైనా కెరీర్ మొత్తం ఒకేలా తేలిగ్గా పరుగులు సాధిస్తూ ఆడలేరు కదా. కోహ్లీ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు. అతడికి ఇప్పుడు కాస్త విరామం కావాలి. కొన్నిరోజులు కుటుంబంతో హాయిగా గడపాలి. తర్వాత ఇంగ్లాండ్‌కు వెళ్లి రాణించాలి. ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా కష్టపడితే మళ్లీ ఫామ్ అందుకుంటాడు. తిరిగి సెంచరీల మీద సెంచరీలు సాధిస్తాడు’ అని వాన్ చెప్పుకొచ్చాడు.
అలాగే ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ సైతం కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. అతడు పరుగులు చేయకపోతే తాను కూడా బాధపడతానని అన్నాడు. ‘ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. కోహ్లీ పరుగులు చేసినప్పుడు ఆ జట్టు కూడా బాగా ఆడుతుంది. అతడు ఆడకపోతే అది కూడా విఫలమవుతుంది. 2016లో అతడు అత్యధిక పరుగులు చేసినప్పుడు బెంగళూరు అత్యద్భుత ప్రదర్శన చేసింది. అతడు గొప్ప ఆటగాడే అయినా.. దురదృష్టంకొద్దీ ఈ సీజన్లో క్వాలిఫయర్-2లో తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ఇది అతడు విశ్రాంతి తీసుకొని.. బ్యాటింగ్‌లో లోపాలు సరిదిద్దుకొని తిరిగి బలంగా పుంజుకొనేందుకు అవకాశం అయి ఉండొచ్చు’ అని బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Crime news: పట్టపగలే టైలర్ దారుణ హత్య.. ఉదయ్‌పూర్‌లో టెన్షన్.. టెన్షన్..
-
General News
Covid update: కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. తెలంగాణలో కొత్తగా 459 కేసులు
-
Movies News
Chiranjeevi: అల్లూరి విగ్రహావిష్కరణ.. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం
-
World News
Prison Escape: కొలంబియా కారాగారంలో విషాదం.. 49 మంది ఖైదీలు మృతి
-
World News
NATO: మాడ్రిడ్‌కు బయల్దేరిన నాటో దేశాధినేతలు..!
-
General News
Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800కోట్లు మాయం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
- Madhavan: ఇది కలా.. నిజమా! మాధవన్‌ను చూసి ఆశ్చర్యపోయిన సూర్య..!
- Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా ముద్రవేశారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత