Ravi Shastri - Rohit Sharma: రోహిత్‌కు విరామం అవసరం లేదు: శాస్త్రి

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విరామం అవసరం లేదని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ముంబయి...

Published : 24 May 2022 01:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విరామం అవసరం లేదని మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ తంటాలు పడిన సంగతి తెలిసిందే. అతడు ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 19.14 సగటుతో 268 పరుగులే చేశాడు. అందులో ఒక్క అర్ధశకతం కూడా లేదు. ఇక అత్యుత్తమ స్కోర్‌ 48 పరుగులే. ఈ నేపథ్యంలోనే రోహిత్‌పై స్పందించిన రవిశాస్త్రి.. హిట్‌మ్యాన్‌కు విరామం ఇవ్వాలా.. వద్దా..? అనే విషయంపై తన అభిప్రాయాలు వెల్లడించాడు.

‘రోహిత్‌కు విరామం అవసరం లేదు. మరోవైపు కోహ్లీ విషయానికి వస్తే.. అతడు ఏడాదిన్నరకుపైగా ఫార్మాట్లకు అతీతంగా క్రికెట్‌ ఆడుతున్నాడు. రోహిత్‌ గాయాల కారణంగా కొన్ని సందర్భాల్లో భారత జట్టుకు దూరమయ్యాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత అతడు ఆస్ట్రేలియా టూర్‌కు సగంలోనే వెళ్లాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు మొత్తానికే దూరమయ్యాడు. కోహ్లీ విషయంలో అలా జరగలేదు. ముంబయి ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించాక సుమారు రెండు వారాలు సమయం ఉంటుంది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేముందు అతడికి ఆ విరామం చాలు’ అని రవిశాస్త్రి ఓ క్రీడాఛానల్‌తో చెప్పాడు. కాగా, ఇదే టీ20లీగ్‌లో కోహ్లీ ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్న వేళ శాస్త్రి స్పందిస్తూ.. అతడికి కొద్ది కాలం విశ్రాంతి అవసరమని చెప్పిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని