Ravi Shastri: చెన్నై కెప్టెన్‌గా అతడిని నియమించాల్సింది.. జడేజా ఆటపై దృష్టిసారించాలి

ఈ సీజన్‌లో చెన్నై జట్టు రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా చేసి తప్పు చేసిందని, అతడికి బదులు మాజీ ఓపెనర్‌ ఫా డుప్లెసిస్‌ను అట్టిపెట్టుకొని కెప్టెన్‌గా నియమించాల్సిందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు...

Published : 11 Apr 2022 13:35 IST

టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సీజన్‌లో చెన్నై జట్టు రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా చేసి తప్పు చేసిందని, అతడికి బదులు మాజీ ఓపెనర్‌ ఫా డుప్లెసిస్‌ను అట్టిపెట్టుకొని కెప్టెన్‌గా నియమించాల్సిందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జరుగుతోన్న మెగా టోర్నీలో ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవని సంగతి తెలిసిందే. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతోంది. శనివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమిపాలైన నేపథ్యంలో ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘జడేజా లాంటి ఆటగాడు తన ఆటపై దృష్టిసారించాలని నేను అనుకుంటున్నా. స్టార్‌ ప్లేయర్‌ డుప్లెసిస్‌ను చెన్నై వదులుకోవాల్సింది కాదు. ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న సమయంలో.. జడేజాకు బదులుగా డుప్లెసిస్‌కు ఆబాధ్యతలు అప్పగించి ఉంటే బాగుండేది. జడేజా తన ఆటపైనే దృష్టిపెట్టేవాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా తన సహజసిద్ధమైన ఆట కొనసాగించేవాడు. అలా చేసుంటే చెన్నై పరిస్థితి మరోలా ఉండేది’ అని శాస్త్రి వివరించాడు. కాగా.. ఈ సీజన్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందే ధోనీ కెప్టెన్సీ వదులుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని