Sachin Tendulkar: సచిన్‌ తెందూల్కర్‌ టీ20 జట్టు.. ఆ ఇద్దరికి దక్కని చోటు

టీ20 లీగ్‌ సందడి ముగిసింది. లీగ్‌లోకి అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే గుజరాత్‌ టైటిల్‌ని ఎగరేసుకుపోయింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో రాజస్థాన్‌ను  హార్దిక్‌ సేన 7 వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది.

Published : 01 Jun 2022 02:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీ20 లీగ్‌ సందడి ముగిసింది. లీగ్‌లోకి అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే గుజరాత్‌ టైటిల్‌ని ఎగరేసుకుపోయింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో రాజస్థాన్‌ను హార్దిక్‌ సేన 7 వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 9 వికెట్ల నష్టానికి 130 పరుగులే చేయగా.. ఈ లక్ష్యాన్ని గుజరాత్‌ 3 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. అయితే, ఈ సీజన్‌లో కొంతమంది ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించగా.. మరికొంత మంది తీవ్రంగా నిరాశపరిచారు. ఈ క్రమంలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్ ఈ సీజన్‌లో తన బెస్ట్ ఎలెవన్‌ను ప్రకటించాడు. 

గుజరాత్‌కు కప్‌ని సాధించి పెట్టిన హార్దిక్‌ పాండ్యను సచిన్‌ తాను ఎంచుకున్న జట్టుకు కెప్టెన్‌గా నియమించాడు. ఈ సీజన్‌లో నాలుగు శతకాలు బాది అత్యధిక పరుగులు (863) చేసిన ఆటగాడిగా నిలిచిన జోస్ బట్లర్‌, పంజాబ్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ని ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లుగా కేఎల్ రాహుల్‌, హార్దిక్ పాండ్య, డేవిడ్‌ మిల్లర్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, దినేశ్ కార్తీక్‌లను తీసుకున్నాడు. రషీద్‌ఖాన్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, యుజువేంద్ర చాహల్‌లను బౌలర్లుగా ఎంపిక చేశాడు. టీ20 లీగ్‌లో మంచి బ్యాటర్లుగా గుర్తింపు పొందిన ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రోహిత్ శర్మ (268), కోహ్లీ (341) పరుగులు మాత్రమే చేశారు. దీంతో సచిన్‌ తెందూల్కర్‌ ప్రకటించిన టీ20 జట్టులో ఈ ఇద్దరి ఆటగాళ్లకు చోటు దక్కలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని