Shubman Gill : రనౌట్‌గా వెనుదిరుగుతూ బౌలర్‌పై ఆగ్రహం..!

ఈ టీ20 సీజన్‌లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోన్న గుజరాత్‌కు.. పంజాబ్‌ నిన్న

Published : 05 May 2022 01:37 IST

ముంబయి : ఈ టీ20 సీజన్‌లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోన్న గుజరాత్‌కు.. పంజాబ్‌ నిన్న మరో ఓటమి రుచి చూపించింది. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టిన పంజాబ్‌.. అవసరమైన వేళ విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే.. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బ్యాట్స్‌మెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(9) సందీప్‌ శర్మ వేసిన మూడో ఓవర్‌ మొదటి బంతికే రనౌట్‌గా వెనుదిరిగాడు. రిషి ధావన్‌ మెరుపు త్రోకు పెవిలియన్‌ చేరాడు. అయితే ఆ సమయంలో కోపంతో గిల్‌.. బౌలర్‌ సందీప్‌ శర్మతో మాటల యుద్ధానికి దిగినట్లు తెలుస్తోంది. పరుగు కోసం ప్రయత్నించిన గిల్‌కు సందీప్‌ శర్మ అడ్డురాగ తోసుకుంటూ వెళ్లాడు. అయితే అప్పటికే బంతి స్టంప్స్‌ను తాకడంతో గిల్‌ రనౌట్ అవక తప్పలేదు. దీంతో గిల్‌ సహనం కోల్పోయి బౌలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెవిలియన్‌ వైపు నడిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో బంతితో, బ్యాటుతో చెలరేగిన పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో గుజరాత్‌ను చిత్తు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు