Rajasthan Vs Chennai : చెన్నైపై విజయం.. లీగ్ దశలో రెండో స్థానం రాజస్థాన్‌దే
ముంబయి: టీ20 టోర్నీలో రాజస్థాన్ ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. రాజస్థాన్ రెండో స్థానంతో లీగ్ దశను ముగించింది. యశస్వి జైస్వాల్ (59), రవిచంద్రన్ అశ్విన్ (40*) రాణించడంతో చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో 151 పరుగులు చేసి విజయం సాధించింది. మిగతా బ్యాటర్లలో జోస్ బట్లర్ 2, సంజూ శాంసన్ 15, దేవదుత్ పడిక్కల్ 3, హెట్మయేర్ 6, రియాన్ పరాగ్ 10* పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ప్రశాంత్ సోలంకి 2.. సిమర్జిత్, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ తలో వికెట్ తీశారు.
రాజస్థాన్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లకుగాను 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. లఖ్‌నవూ కూడా 18 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో రాజస్థాన్ టాప్-2లోకి దూసుకొచ్చింది. మరోవైపు చెన్నై ఓటమితో ఇంటిముఖం పట్టింది. చెన్నై 14 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించింది.
రసవత్తరంగా మ్యాచ్...
రాజస్థాన్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. కీలక సమయంలో యశస్వి జైస్వాల్ (59) అర్ధశతకం సాధించాడు. అయితే సోలంకి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద పతిరాన అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజ్లోఅశ్విన్ (13*) , హెట్మయేర్ ఉన్నారు. అంతకుముందు దేవదుత్ పడిక్కల్ (3) ఘోరంగా విఫలమయ్యాడు. రాజస్థాన్ విజయానికి ఇంకా 30 బంతుల్లో 47 పరుగులు కావాలి.
పెవిలియన్‌కు సంజూ శాంసన్
చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ రాజస్థాన్ పరుగులు చేసేందుకు శ్రమిస్తోంది. ఈ క్రమంలో మిచెల్ సాంట్నర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సంజూ శాంసన్ (15) పెవిలియన్‌కు చేరాడు. అది కూడానూ మిచెల్ సాంట్నరే బౌలర్. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. క్రీజ్‌లో యశస్వి జైస్వాల్ (39*), దేవదుత్ పడక్కల్ (1*) ఉన్నారు. రాజస్థాన్ విజయం సాధించాలంటే 66 బంతుల్లో ఇంకా 80 పరుగులు చేయాలి.
రాజస్థాన్ ఛేదన ప్రారంభించింది. అయితే డేంజరస్ బ్యాటర్ జోస్ బట్లర్ (2) పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజ్‌లో యశస్వి (26*), సంజూ (8*) ఉన్నారు. చెన్నై బౌలర్ సిమర్జిత్ బౌలింగ్‌లో మొయిన్ అలీ చేతికి చిక్కి బట్లర్ ఔటయ్యాడు. మరోవైపు యశస్వి దూకుడుగా ఆడుతున్నాడు. రాజస్థాన్ విజయానికి 96 బంతుల్లో 114 పరుగులు కావాలి.
చెన్నై స్కోరు 150/6
మొయిన్ అలీ (93) రాణించడంతో రాజస్థాన్‌కు చెన్నై 151 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ కాకుండా ఎంఎస్ ధోనీ (26), డేవన్ కాన్వే (16) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా బ్యాటర్లలో రుతురాజ్ 2, జగదీశన్ 1, అంబటి రాయుడు 3, మిచెల్ సాంట్నర్ 1*, సిమర్జీత్ 3* పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 2, మెక్కాయ్ 2.. ట్రెంట్ బౌల్ట్, అశ్విన్ చెరో వికెట్ తీశారు. పవర్‌ప్లే (6 ఓవర్లు) 75 పరుగులు చేసిన చెన్నై.. మిగతా 14 ఓవర్లలో మరో 75 పరుగులను మాత్రమే చేయడం గమనార్హం.
కట్టుదిట్టంగా రాజస్థాన్ బౌలింగ్
రాజస్థాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో చెన్నై పరుగుల వేగం మందగించింది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. క్రీజ్‌లో మొయిన్ అలీ (78*), ఎంఎస్ ధోనీ (13*) ఉన్నారు. మిగిలిన ఐదు ఓవర్లలో భారీగా పరుగులు చేస్తేనే రాజస్థాన్ ఎదుట మంచి లక్ష్యం ఉంచగలిగే పరిస్థితి ఉంటుంది.
స్వల్ప వ్యవధిలో వికెట్లు
స్వల్ప వ్యవధిలో వికెట్లు పడటంతో చెన్నై స్కోరు బోర్డు నెమ్మదించింది. రాజస్థాన్ బౌలర్లు విజృంభించడంతో డేవన్ కాన్వే (16), జగదీశన్ (1), అంబటి రాయుడు (3) పెవిలియన్‌కు చేరారు. అంతకుముందు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (2) విఫలమయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజ్‌లో మొయిన్ అలీ (71*), ఎంఎస్ ధోనీ (1*) ఉన్నారు.
మొయిన్ అలీ రికార్డు హాఫ్ సెంచరీ
చెన్నై వన్‌డౌన్ బ్యాటర్ మొయిన్ అలీ (21 బంతుల్లో 55*) భీకరంగా విరుచుకుపడ్డాడు. కేవలం 19 బంతుల్లోనే రికార్డు అర్ధశతకం నమోదు చేశాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన ఐదో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాదిన మొయిన్ అలీ.. ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌ను ఉతికేశాడు. ఐదు ఫోర్లు, సిక్స్‌తో 26 పరుగులు బాదాడు. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజ్‌లో మొయిన్తోపాటు డేవన్ కాన్వే (14*) ఉన్నాడు. వీరిద్దరూ ఇప్పటికే 73 పరుగులను జోడించారు.
రుతురాజ్ ఔట్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (2) పెవిలియన్‌కు చేరాడు. రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి గైక్వాడ్ ఔటయ్యాడు. రెండో ఓవర్ వేసిన ప్రసిధ్ కృష్ణ కేవలం ఒక్క పరుగునే ఇచ్చాడు. అనంతరం మూడో ఓవర్లో డేవన్ కాన్వే (13*) కాస్త బ్యాట్‌ను ఝులిపించాడు. సిక్స్, ఫోర్ బాదాడు. ప్రస్తుతం 3 మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. క్రీజ్‌లో కాన్వేతోపాటు మొయిన్ అలీ ఉన్నాడు.
టాస్ నెగ్గిన ధోనీ
టీ20 టోర్నీలో రాజస్థాన్, చెన్నై తమ చివరి లీగ్ మ్యాచ్‌ను మరికాసేపట్లో ఆడబోతున్నాయి. ఇప్పటికే చెన్నై ఇంటిముఖం పట్టగా.. రాజస్థాన్ రెండో స్థానంతో లీగ్ దశను ముగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకుని రాజస్థాన్‌కు బౌలింగ్ అప్పగించాడు. ప్రస్తుతం రాజస్థాన్ 13 మ్యాచులకుగాను ఎనిమిది విజయాలు సాధించి 16 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం లఖ్‌నవూ కంటే ఉత్తమ నెట్‌రన్‌రేట్ కారణంగా టాప్-2లోకి దూసుకెళ్తుంది. దీని వల్ల నాకౌట్ దశలో తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ను ఓడినప్పటికీ మరొక ఛాన్స్ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడితే మూడు లేదా నాలుగో స్థానంలోకి పడిపోతుంది.
ఈ మ్యాచ్‌లో ధోనీ సేన గెలిస్తే లీగ్‌ను విజయంతో ముగించినట్లూ ఉంటుంది.. పాయింట్ల పట్టికలోనూ చివరి స్థానానికి పడిపోకుండా పది పాయింట్లను సాధించే అవకాశం ఉంటుంది. గత మ్యాచ్‌కు దూరమైన అంబటి రాయుడు ఈసారి తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
జట్ల వివరాలు:
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, జగదీశన్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి, సిమర్జిత్ సింగ్, మతీషా పతిరాన, ముకేశ్ చౌదరి
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదుత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మయేర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, మెక్కాయ్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Facebook: ఫేస్బుక్ మెసెంజర్ సహాయంతో కుటుంబం చెంతకు బెంగాల్ బాలుడు
-
Ap-top-news News
Andhra News: ఏపీలో జులై 5 నుంచి బడులు
-
Related-stories News
Telangana News: సరెండర్‌లీవ్ డబ్బు కోసం ఎదురుచూపులు
-
Ts-top-news News
Telangana News: నన్ను చదివించండి సారూ!
-
Ts-top-news News
TS TET Results 2022: టెట్ ఫలితాలు నేడు లేనట్లే!
-
General News
Weather Forecast: నేడు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కూనపై అలవోకగా..
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- లీజుకు క్వార్టర్లు!
- Road Accident: నుజ్జయిన కారులో గర్భిణి నరకయాతన
- Dharmana Prasada Rao: పార్టీపై ఆధారపడి బతకొద్దు