Dhanashree verma: చాహల్‌, బట్లర్‌కు డాన్స్‌ నేర్పించిన ధనశ్రీ

యుజ్వేంద్ర చాహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ.. తన భర్తతో పాటు జోస్‌ బట్లర్‌కు డాన్స్‌ నేర్పిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది...

Published : 01 Jun 2022 02:02 IST

(Photo: Dhanashree Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: యుజ్వేంద్ర చాహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ.. తన భర్తతో పాటు జోస్‌ బట్లర్‌కు డాన్స్‌ నేర్పిస్తోన్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆదివారం పూర్తయిన భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో రాజస్థాన్‌ తరఫున వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. బట్లర్‌ మొత్తం 863 పరుగులతో ఈ సీజన్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌.. చాహల్‌ 27 వికెట్లతో టాప్‌ వికెట్‌ టేకర్‌గా పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నారు.

ఈ నేపథ్యంలోనే టోర్నీ పూర్తయ్యాక ధనశ్రీ సోమవారం వారిద్దరికీ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేయిస్తోన్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అందులో ధనశ్రీ ముందు నిల్చొని స్టెప్పులు కంపోజ్‌ చేస్తుండగా.. బట్లర్‌, చాహల్‌ ఆమె వెనకాలే సాధన చేశారు. అయితే, చాహల్‌ కొద్దిసేపే డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసి.. ఇక తనవల్ల కాదని పక్కకు తప్పుకొన్నాడు. మీరూ ఆ వీడియో చూసి ఆస్వాదించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని