Dhoni: మహేంద్రసింగ్‌ ధోనీ స్పిన్‌ బౌలింగ్‌ చూశారా?

చెన్నై జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఎప్పుడో ఒకసారి టీమ్‌ఇండియా తరఫున బౌలింగ్‌ చేశాడు. అలాగే గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ మెంటార్‌గా ఉంటూ...

Published : 17 Apr 2022 09:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ గతంలో అప్పుడప్పుడు టీమ్‌ఇండియా తరఫున బౌలింగ్‌ చేసిన విషయం తెలిసిందే. అలాగే గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ మెంటార్‌గా ఉంటూ నెట్స్‌లో ఆటగాళ్లకు బౌలింగ్‌ చేశాడు. ఇప్పుడు మళ్లీ మహీ బౌలింగ్‌తో తన అభిమానులను అలరించాడు. ఈసారి చెన్నై జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా మహీ లెగ్‌స్పిన్‌ బౌలింగ్‌ వేశాడు. అందుకు సంబంధించిన వీడియోను ఆ జట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దానికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

మరోవైపు చెన్నై జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కటే విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాత్రి గుజరాత్‌తో తమ ఆరో మ్యాచ్‌లో తలపడనుంది. ఇందులో విజయం సాధించి ముందుకు వెళ్లాలని చూస్తోంది. అందుకోసమే చెన్నై టీమ్‌ నెట్స్‌లో చెమటోడ్చి సాధన చేసింది. ఈ సందర్భంగా ధోనీ స్పిన్‌ బౌలింగ్‌ చేస్తూ కనిపించాడు. మీరూ ఆ వీడియో చూసి ఆస్వాదించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని