యాపిల్‌ ముందడుగు.. మౌస్‌ మాయం!

కంప్యూటర్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది మానిటర్‌, సీపీయూ, కీ బోర్డు, మౌస్‌. ఆ తర్వాతే మిగిలిన డివైజ్‌లు ఏవైనా. ఇకపై కంప్యూటర్‌ అనగానే అందులో మౌస్‌ భాగం...

Updated : 31 Mar 2021 20:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంప్యూటర్‌ అనగానే ముందుగా గుర్తొచ్చేది మానిటర్‌, సీపీయూ, కీ బోర్డు, మౌస్‌. ఆ తర్వాతే మిగిలిన డివైజ్‌లు ఏవైనా. ఇకపై కంప్యూటర్‌ అనగానే అందులో మౌస్‌ భాగం కాకపోవచ్చు. అయితే అన్ని కంప్యూటర్లకు కాకపోయినప్పటికీ.. మ్యాక్‌ కంప్యూటర్ల వరకు ఇది సమీప భవిష్యత్‌ సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం మౌస్‌ను తొలగించాలని ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ భావిస్తుండడమే. ఇప్పటికే సీపీయూను మానిటర్‌లో అంతర్భాగం చేసిన యాపిల్‌.. త్వరలో మ్యాక్‌ కంప్యూటర్లలో మౌస్‌ స్థానే కొత్త డివైజ్‌ను తీసుకొస్తోందట. దీనిపై ఇప్పటికే పనిచేస్తోందని సమాచారం.

మౌస్‌ను ఉపయోగించేటప్పుడు చేతి వేళ్లతో మనం చేసే పనులన్నింటినీ దాని అవసరం ఈ కొత్త పరికరంతో చేయించాలనేది యాపిల్‌ ప్రణాళిక. ఇందుకోసం చేతికి తొడుక్కునే ఉంగరంలాంటి పరికరాన్ని తీసుకురానుంది. మౌస్‌లా పనిచేయాలంటే ఆ ఉంగరాన్ని కంప్యూటర్‌ వాడే వ్యక్తి ధరించాల్సి ఉంటుంది.  కేవలం ఉంగరం ధరించిన వేలు మాత్రమే కాక.. పక్కన వేలి తాలూకా కదలికలను సైతం గుర్తించేలా ఈ డివైజ్‌లో సెన్సర్లు అమర్చనున్నట్లు తెలుస్తోంది. మ్యాక్‌ కంప్యూటర్లతో పాటు మ్యాక్‌ బుక్‌, ఐఫోన్‌, ఐప్యాడ్‌, టీవీ, స్మార్ట్‌ గ్లాస్‌తో పాటు వంటి ఇతర డివైజ్‌లకు సైతం ఈ డివైజ్‌ పనిచేసేలా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. అయితే, ఈ పరికరం ఎప్పుడొచ్చేదీ తెలియాలంటే యాపిల్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని