యాపిల్ దూకుడు.. 6జీపై కన్ను

వేగవంతమైన మొబైల్ డేటాను అందించేందుకు మొబైల్ కంపెనీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే 5జీ సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా యాపిల్ 6జీ వైర్‌లెస్‌ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించి పనులు ప్రారంభించినట్లు...

Published : 19 Feb 2021 23:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వేగవంతమైన మొబైల్ డేటాను అందించేందుకు మొబైల్ కంపెనీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే 5జీ సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా యాపిల్ 6జీ వైర్‌లెస్‌ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించి పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొబైల్ ప్రాసెసర్ తయారీ కంపెనీ క్వాల్‌కోమ్‌తో కలిసి యాపిల్ ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తోందట. ఈ మేరకు తర్వాతి తరం వైర్‌లెస్‌ టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్‌లో పనిచేసేందుకు ఉద్యోగులు కావాలని ప్రకటన విడుదల చేసింది. 

ఇటీవలే 6జీ సాంకేతికత అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు యాపిల్, గూగుల్, ఎల్‌జీ కంపెనీలు ‘నెక్ట్స్‌ జీ అలియెన్స్‌’ పేరుతో గ్రూపుగా ఏర్పడ్డాయి. దిగ్గజ కంపెనీలు ఒకే సాంకేతికత కోసం చేతులు కలపడం వల్ల దానికి సంబంధించిన ప్రక్రియ మరింత వేగవంతమై త్వరలోనే 6జీ సాంకేతికత వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది యాపిల్ 5జీ ఫీచర్‌తో ఐఫోన్ 12 సిరీస్‌ ఫోన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో క్వాల్‌కోమ్ మోడెమ్‌లను ఉపయోగించారు. తాజా సమాచారం ప్రకారం యాపిల్ సొంత మోడెమ్‌ల తయారీ దృష్టి సారించిందట. భవిష్యత్‌లో యాపిల్ ఫోన్లలో తన సొంత మోడెమ్‌లను ఉపయోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మ్యాక్ కంప్యూటర్లలో ఇంటెల్ చిప్‌లకు బదులు సిలికాన్‌ చిప్‌లను ఉపయోగిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని