Clubhouse: మాట్లాడుతూనే.. చాట్ చేసేయండి

ఆడియో సోషల్‌ మీడియా యాప్ క్లబ్‌ హౌస్ యూజర్స్‌ కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘బ్యాక్‌ఛానెల్’ పేరుతో డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని సాయంతో యాప్‌లో వన్‌-టు-వన్‌, గ్రూప్‌ ఛాట్‌లు సులభంగా చేసుకోవచ్చని తెలిపింది...

Published : 17 Jul 2021 23:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆడియో సోషల్‌ మీడియా యాప్ ‘క్లబ్‌ హౌస్’ యూజర్స్‌ కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘బ్యాక్‌ఛానల్’ పేరుతో డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని సాయంతో యాప్‌లో వన్‌-టు-వన్‌, గ్రూప్‌ చాట్‌లు సులభంగా చేసుకోవచ్చని తెలిపింది. అలానే ఆడియో రూమ్‌ మధ్యలో లేదా ముగిసిన తర్వాత ఒకరితో ఒకరు చాట్‌ చేసేందుకు ఇతర యాప్‌లపై ఆధారపడకుండా క్లబ్‌హౌస్‌లో సంభాషించుకునేందుకు వీలుగా బ్యాక్‌ఛానల్‌ను డిజైన్‌ చేసినట్లు వెల్లడించింది. క్లబ్‌హౌస్‌కి పోటీగా వచ్చిన ట్విటర్ స్పేసెస్‌, ఫేస్‌బుక్ లైవ్‌ ఆడియోలో డైరెక్ట్ మెసేజ్ ఫీచర్ ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఆడియో ద్వారా చర్చ జరుగుతున్నప్పుడే చాట్ చేసుకోవచ్చు.

కొవిడ్-19 పరిస్థితుల్లో ఆడియో మెసేజింగ్ ఫీచర్‌ రావడంతో వివిధ అంశాల గురించి చర్చించేందుకు ఈ యాప్‌ను ఎక్కువ మంది ఉపయోగించారు. తర్వాత ట్విటర్, ఫేస్‌బుక్ కూడా ఆడియో మెసేజింగ్ ఫీచర్‌ను తీసుకురావడంతో యూజర్స్ క్రమంగా వాటిని ఉపయోగించేందుకు మొగ్గుచూపారు. అలానే ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం క్లబ్‌ హౌస్‌ యాప్ విడుదల చేసిన తర్వాత సుమారు 80 లక్షల మంది కొత్త యూజర్స్ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారట. అంతేకాకుండా 5 వేల మందితో చాట్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకునే ప్రత్యేకమైన ఫీచర్‌ క్లబ్‌ హౌస్‌లో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని