షావోమీ కొత్త తేలికైన ఫోన్‌

షావోమీ కంపెనీ తమ ఎంఐ 11 సిరీస్‌ ఫోన్లలో భాగంగా ఎంఐ 11 లైట్‌ మొబైల్‌ని 22న భారత విపణిలోకి ప్రవేశ పెట్టనుంది. ఎంఐ 11ఎక్స్‌ ఫోన్లతో పోలిస్తే అప్పర్‌ మిడ్‌ రేంజ్‌ ధరలో ఇది అందుబాటులో ఉండొచ్చని భావిస్తున్నారు. ఇది ఈ సంవత్సరపు అతి సన్నని, తేలికైన, ఎన్నో ఫీచర్లతో కూడిన ఫోన్‌ అని షావోమీ తమ ట్వీట్‌లో పేర్కొంది.

Updated : 16 Jun 2021 08:18 IST

షావోమీ కంపెనీ తమ ఎంఐ 11 సిరీస్‌ ఫోన్లలో భాగంగా ఎంఐ 11 లైట్‌ మొబైల్‌ని 22న భారత విపణిలోకి ప్రవేశ పెట్టనుంది. ఎంఐ 11ఎక్స్‌ ఫోన్లతో పోలిస్తే అప్పర్‌ మిడ్‌ రేంజ్‌ ధరలో ఇది అందుబాటులో ఉండొచ్చని భావిస్తున్నారు. ఇది ఈ సంవత్సరపు అతి సన్నని, తేలికైన, ఎన్నో ఫీచర్లతో కూడిన ఫోన్‌ అని షావోమీ తమ ట్వీట్‌లో పేర్కొంది. ఈ ఫోన్‌ ఏప్రిల్‌లో చైనాలో విడుదలైంది. ఇండియన్‌ రకం కూడా దాదాపు అలాగే ఉండొచ్చని అనుకుంటున్నారు. అలా చూస్తే 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో 6.55 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ఆమ్‌లెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 732జీతో 6 జీబీ, 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్‌ వరకు లభించవచ్చు. వెనుకవైపు డ్యుయల్‌-టోన్‌ ఫ్లాష్‌తో 64 ఎంపీ ప్రైమరీ, 8 ఎంపీ అల్ట్రావైడ్‌, 5 ఎంపీ మైక్రో కెమెరాలు.. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 4,250 ఎంఏహెచ్‌ బ్యాటరీ, డ్యుయెల్‌ స్టీరియో స్పీకర్లుండే అవకాశముంది. ధర పాతిక వేల వరకు ఉండొచ్చని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు