JIO: వాట్సప్‌తోనూ జియో రీఛార్జ్‌!

టెలీ కమ్యూనికేషన్స్‌ దిగ్గజం రిలయన్స్‌ జియో వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సప్‌లోనూ రీఛార్జ్‌ సదుపాయం కల్పించింది. ఇందుకోసం కాంటాక్ట్‌ లిస్ట్‌లో జియో కేర్‌ నంబర్‌ 7000770007ను సేవ్‌ చేసుకుని వాట్సప్‌ నుంచి ‘హాయ్‌’ అని మెసేజ్‌ పంపిస్తే చాలు. ఇందులో మరిన్ని సదుపాయాలూ కల్పించింది

Updated : 16 Jun 2021 22:34 IST

టెలీ కమ్యూనికేషన్స్‌ దిగ్గజం రిలయన్స్‌ జియో వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సప్‌లోనూ రీఛార్జ్‌ సదుపాయం కల్పించింది. ఇందుకోసం కాంటాక్ట్‌ లిస్ట్‌లో జియో కేర్‌ నంబర్‌ 7000770007ను సేవ్‌ చేసుకుని వాట్సప్‌ నుంచి ‘హాయ్‌’ అని మెసేజ్‌ పంపిస్తే చాలు. ఇందులో మరిన్ని సదుపాయాలూ కల్పించింది. ‘హాయ్‌’ అని మెసేజ్‌ పంపితే జియో సిమ్‌ రీఛార్జ్‌తో పాటు గెట్‌ న్యూ జియో సిమ్‌ ఆర్‌ పోర్ట్‌ ఇన్‌ (ఎంఎన్‌పీ), సపోర్ట్‌ ఫర్‌ జియో సిమ్‌, సపోర్ట్‌ ఫర్‌ జియో ఫైబర్‌, సపోర్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ రోమింగ్‌, సపోర్ట్‌ ఫర్‌ జియో మార్ట్‌ ఆప్షన్లు కూడా కనిపిస్తాయి. రీఛార్జ్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకుంటే, నిర్దేశిత ప్రిపెయిడ్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. నచ్చినదాన్ని ఎంచుకున్నాక పేమెంట్‌ కోసం కంపెనీ అధికారిక సైట్‌కి వెళతారు. ఒకవేళ ఏదైనా అనుకోని సమస్య తలెత్తితే, ఫిర్యాదునూ నమోదు చేయొచ్చు. సంబంధిత బాట్‌ దానంతట అదే ఇంగ్లిషులో మనతో ఛాట్‌ చేస్తుంది. కావాలంటే హిందీని కూడా ఎంపిక చేసుకోవచ్చు. వాట్సప్‌ ద్వారా ‘సెట్‌ లాంగ్వేజ్‌’ మెసేజ్‌ను పంపి భాషను మార్చుకోవచ్చు. మున్ముందు మరిన్ని భారతీయ భాషల్లోనూ ఛాట్‌ని అందుబాటులోకి తెస్తామని కంపెనీ చెబుతోంది. టీకా కేంద్రాల వంటి ఇతర సమాచారాన్నీ ఇది అందిస్తుంది. ప్రస్తుతం ‘మై జియో’ యాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకునే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని